
అవస్థల వైద్యం!
● రోగులకు తప్పని కష్టాలు ● సర్వజన ఆస్పత్రిలో ఓపీ, మందులు, ల్యాబ్‌లు వేర్వేరు చోట్ల నిర్వహణ
ఈ చిత్రం చూశారా... ఇది విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ల్యాబొరేటరీకి వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులు. ఇక్కడ కూర్చొనేందుకు పూర్తి స్థాయిలో కుర్చీలుకూడా లేకపోవడంతో గంటల తరబడి నిల్చొనే నిరీక్షించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆస్పత్రిలోని ఓపీ విభాగం. ఇరువైపులా రోగులు కూర్చోవడంతో వైద్యులు సైతం వారి ఓపీ గదుల్లోకి వెళ్లేందుకు స్థలం లేని దుస్థితి.
విజయనగరం ఫోర్ట్:
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి... జిల్లాకే పెద్దాస్పత్రి. ప్రజల వైద్యసేవలకు ప్రధాన ఆధా రం. వైద్యసేవల కోసం అధికమంది ఆశ్రయించే ది ఈ ఆస్పత్రినే. రోజుకు 1000 నుంచి 1200 వరకు ఓపీ నమోదవుతుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఆస్పత్రిలో అసౌకర్యాలు రోగులను, వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఓపీ, ఎక్స్‌రే, ల్యాబ్, ఫార్మసీ.. ఇలా అన్ని విభాగాల వద్ద సరైన వసతులు లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యకళాశాలలో అన్ని వసతుల కు అవకాశం ఉన్నా నిర్మాణంలో కూటమి ప్రభు త్వం చేస్తున్న జాప్యం రోగులకు శాపంగా మారింది. బోధనాస్పత్రి నిర్మాణం పూర్తయితే సర్వజన ఆస్పత్రిని తరలించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పనుల్లో జాప్యం చేస్తున్నట్టు పలువురు విమర్శిస్తున్నారు. ఆస్పత్రిని వైద్యకళాశాలకు తరలిస్తే మెరుగైన వైద్యసేవలందించేందుకు అవకాశం ఉంటుందని కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు చెబుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఉన్న చోటే శాశ్వతంగా ఉంచాలని కూటమి సర్కారు ప్రయత్నిస్తోంది. ఇరుకు గదుల్లోనే అవస్థలకు గురిచేస్తోంది.
వైద్య సిబ్బందికీ అవస్థలే...
జిల్లా ఆస్పత్రిగా ఉన్నప్పడు ఆస్పత్రిలో ఓపీ విభాగానికి ఒకరు, ఇద్దరు వైద్యులు మాత్రమే ఉండే వారు. బోధనాస్పత్రి కావడంతో ప్రతి విభాగం
లోనూ వైద్యులు పెరిగారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియ ర్ రెసిడెంట్లు, పీజీలు ఇలా ప్రతి విభాగానికి ఆరు నుంచి 10 మంది వరకు వైద్యులు ఉంటున్నారు. దీంతో వారు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. బోధనాస్పత్రి మిగులు పను లు పూర్తిచేస్తే 1500 పడకలతో పాటు, అన్ని విభాగాలకు విశాలమైన గదులు, వార్డులు అందుబాటులోకి వస్తాయి. ప్రతిరోజూ వైద్యకళాశాల నుంచి ఆస్పత్రికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. సకాలంలో వైద్యసేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పై చిత్రంలో ఆస్పత్రి బయటవరకు వరుసలో కూర్చున్నది ఫార్మసీ విభాగం. మందులు కోసం ఆస్పత్రిలో సరిపడా స్థలం లేక పోవడంతో ఇలా బయట వరకు రోగులు బారులు తీరారు.

అవస్థల వైద్యం!

అవస్థల వైద్యం!