
●గురజాడ కుటుంబీకులకు అవమానం
గురజాడ వారసులకు నాడు, నేడు అవమానమే మిగిలింది. ప్రభుత్వపరంగా మహాకవికే సరైన గౌరవం ఇవ్వలేదని సాహితీవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియం, ఆనందగజపతి ఆడిటోరియంలో గతంలో సాంస్కృతిక, సభా కార్యక్రమాలు నిర్వహించేవారు. సాహితీవేత్తలకు, కుటుంబ సభ్యులకు సత్కారాలు చేసేవారు. నేడు నడిరోడ్డుపైనే టెంట్ వేసి సమావేశం నిర్వహించి తూతూ మంత్రంగా నిర్వహించడాన్ని విమర్శిస్తున్నారు. మహకవి మేధస్సు ప్రపంచానికి పనికివచ్చినప్పటికీ విజయనగరం వచ్చేసరికి ఈ ఏడాది ఓ లాడ్జి వరకే పరిమితం చేశారని, గురజాడ కుటుంబీకులను స్టేజ్‌పైకి ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతున్నారు.