వేగుచుక్క.. గురజాడ | - | Sakshi
Sakshi News home page

వేగుచుక్క.. గురజాడ

Sep 21 2025 1:33 AM | Updated on Sep 21 2025 1:33 AM

వేగుచ

వేగుచుక్క.. గురజాడ

వేగుచుక్క.. గురజాడ

నాటికి.. నేటికీ అజరామరం కన్యాశుల్కం

నేడు మహాకవి 163వ జయంతి

విజయనగరం టౌన్‌: విజయనగర ఖ్యాతిని దశ దిశలా చాటిన మహానుభావులు ఎందరో ఉన్నారు. విద్యలనగరమైన విజయనగరంలో సాహితీ సౌరభాలను కురిపించారు. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో వేగుచుక్కలా మెరిసారు. వందల ఏళ్లు దాటినా ఆ సాహితీవేత్తలు అజరామరులే. అటువంటి సాహితీవేత్తలు నడయాడిన నేలపై మనం జన్మించడం మనందరి అదృష్టం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురజాడ 163వ జయంతి ఉత్సవాన్ని ఆదివారం అధికారికంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మహాకవి స్వగృహంలో ఉన్న చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన, 9.15 గంటలకు గురజాడ స్వగృహంలో ఉన్న విగ్రహానికి ప్రముఖులతో పూల మాలాలంకరణ చేస్తారు. 9.30 గంటలకు గురజాడ స్వగృహం నుంచి గురజాడ కూడలి వద్ద ఉన్న గురజాడ కాంస్య విగ్రహం వరకూ ఊరేగింపు ఉంటుంది. అనంతరం 9.45 గంటలకు ప్రముఖులతో పూల మాలాలంకరణ ఉంటుంది. దేశమంటే మట్టికాదోయ్‌,.. సామూహిక దేశభక్తి గీతాలాపన నిర్వహిస్తారు. 10 గంటలకు ప్రముఖుల సందేశాలు, 10.30 గంటలకు వందన సమర్పణ చేయనున్నారు.

మహాకవి గురించి...

సామాజిక సమస్యలపై సాహితీ సమరం పూరించి, విశ్వ సాహితీ వినీలాకాశంలో తెలుగు వెలుగులు విరజిమ్మిన సాహితీ సౌరభం మన మహాకవి గురజాడ వేంకట అప్పారావు. గురజాడ 1862 సెప్టెంబరు 21న రాయవరంలో జన్మించారు. మన మహారాజా విద్యా సంస్థల్లో గిడుగు సహ విద్యార్థిగా మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. తన 23వ ఏట అప్పలనరసమ్మతో వివాహం జరిగింది. ఆయనకు వెంకట రామదాసు, కొండయమ్మలు సంతానం. గురజాడ సమాజంలో రుగ్మతలను రూపు మాపేందుకు కన్యాశుల్కం పేరుతో 1892 ఆగస్టు 13న తొలికూర్పును ప్రదర్శించారు. 1897లో ఆనందగజపతికి అంకితం ఇచ్చారు. రెండో కూర్పును 1909లో ప్రచురించారు. అప్పట్లో సంస్కత భాషకు ఆదరణ ఎక్కువగా ఉండేది. ముత్యాలసరాలు రచించి సామాన్యునికి అర్ధమయ్యే విధంగా రచనలు చేశారు. 1883లో సారంగధర, డామిట్‌ కథ అడ్డం తిరిగింది, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, లవణరాజు కల, నీలగిరి పాటలు, కాసులు, బిల్హణీయం, కన్యక, సుభద్ర, దించు, లంగరు తదితర ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. అన్నింటికన్నా ఎవరూ రాయలేని దేశశభక్తి గేయాన్ని ఆయన ‘దేశమును ప్రేమించుమన్నా..’ అంటూ రాసి విమర్శకుల ప్రశంసలు పొందారు. రాజా వారి కోర్టు దావాలలో ఎడతెరిపి లేకుండా ఆ భారాన్నంతా తన భుజాన్ని వేసుకుని పనులు చేశారు. అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. 1915 నవంబరు 30న ఉదయం 8.20 గంటలకు ఆ మహనీయుడు కన్ను మూశారు.

వేగుచుక్క.. గురజాడ1
1/1

వేగుచుక్క.. గురజాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement