
7న చలో విజయవాడ
● మహాధర్నాకు తరలిరండి
● ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పాలతేరు శ్రీనివాసరావు పిలుపు
విజయనగరం అర్బన్: రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు అక్టోబర్ 7న విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నాకు జిల్లా నుంచి ఉపాధ్యాయులు తరలి రావాలని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ పాలతేరు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మలిచర్ల క్లస్టర్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.