
డివైడర్ ఎక్కిన గ్రానైట్ లారీ
సీతంపేట: స్థానిక ఐటీడీఏ సమీపంలో కొత్తూరు–సీతంపేట రహదారి మధ్య ఉన్న డివైడర్‌పై ఓ గ్రానైట్ లారీ ఎక్కేసింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీపైన ఉన్న గ్రానైట్ రాయి కింద పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. గడిగుడ్డి నుంచి సీతంపేట ఐటీడీఏ వరకు డివైడర్ పై ఉన్న సెంటర్ లైటింగ్ వెలగకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. ఒక విద్యుత్ స్తంభాన్ని కూడా బలంగా ఢీకొట్టడంతో కింద పడింది.
డివైడర్ ఎక్కిన లారీ