
యోగా పోటీ విజేతలుగా పట్టణ విద్యార్థులు
విజయనగరం అర్బన్: తాడేపల్లిడూడెం, పత్తిపాడు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ అసోసియేషన్–2025 చాంపియన్ షిప్‌లో విజయనగరం జిల్లా విద్యార్థులు 13 మంది పతకాలు సాధించారు. ఈ మేరకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మజ్జి శశిభూషణరావు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో గౌరీనాయుడు, పైడిరాజు బంగారు పతకం, గౌరీనాయుడు వెండి పతకం, జి.కిషోర్‌కుమార్ వెండి పతకం దక్కించుకున్నారు. పైడిరాజు, బార్నాల పాపని, తుపాకుల రీతూ కాంస్య పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలో జరిగే 6వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని జిల్లా జనరల్ సెక్రటరీ వడ్లమాని నరసింహమూర్తి తెలిపారు.