
● పశువుల కంటైనర్ బోల్తా
బొండపల్లి: మండలంలోని నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారి26పై గజపతినగరం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న పశువుల కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. సోమవారం వేకువ జామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. పశువులను రవాణా చేస్తుండగా కంటైనర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి బోల్తా పడి పోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు పశువులకు ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ హుటాహుటిన లారీ యాజమాన్యంతో పాటు పశువులను రవాణా చేస్తున్న వారు భారీ క్రేన్లు తీసుకువచ్చి లారీని బయటకు తీసి, అలాగే లారీలో రవాణా చేస్తూ ప్రమాదంలో చెల్లాచెదురైన పశువులను బయటకు తీసి వాటిని వేరే వాహనంలో గుట్టుచప్పడు కాకుండా పోలీసులకు తెలియకుండా తరలించారు.

● పశువుల కంటైనర్ బోల్తా