
● ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా తలపెట్టిన నిరసన వారంలో భాగంగా రాజాం తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. నాలుగు డీఏలను తక్షణమే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి మెమో 57ను అమలు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్‌లను, అసెస్మెంట్ బుక్‌లెట్ విధానాలను రద్దుచేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మధన్‌మోహన్, విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు లంక రామకృష్ణ, ఎలకల భాస్కరరావు, నల్ల రవికుమార్, ఎందువ సీతంనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ మీసాల సత్యంనాయుడు, రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీఆర్కే నాయుడు, బెవర శ్రీనివాసరావు, వి.తారకేశ్వరరావు, శెట్టి శివరావు, వై.రామకృష్ణ, పి.శ్రీకర్, డి.మహేష్, వై.గౌరినాయుడు, రాజేశ్వరి, మాధురి, గీత తదితరులు పాల్గొన్నారు. – రాజాం సిటీ