
● విద్యుత్ ఉద్యోగుల పోరుబాట
విద్యుత్ సంస్థలో దీర్ఘకాలంగా ఉన్న అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం
దాసన్నపేట విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఉద్యోగులు సోమవారం ధర్నా చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నాయన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. జిల్లా కేంద్రంలో 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు, 22న జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు మెమొరాండం
అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సురగాల లక్ష్మణ్, కన్వీనర్ బండారు రాజేష్‌కుమార్, కో చైర్మన్ పి.అప్పలస్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం ఫోర్ట్