విజయనగరం | - | Sakshi
Sakshi News home page

విజయనగరం

Sep 16 2025 8:38 AM | Updated on Sep 16 2025 8:38 AM

విజయన

విజయనగరం

న్యూస్‌రీల్‌

కాలుష్యంతో మత్స్యసంపద నాశనం..

మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

మత్స్యకారులను వీడని..

జెట్టీ చింత..!

మిత్రమా.. నిన్ను మొక్కల్లో చూసుకుంటాం...

నెల్లిమర్ల రూరల్‌: విజయనగరం రింగ్‌ రోడ్డులో ఇటీవల జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో నెల్లిమర్ల మండలం సారిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఆల్తి కుమార్‌గణపతి చనిపోయాడు. స్నేహితుడి జ్ఞాపకార్థం తోటి విద్యార్థులు సోమవారం మొక్కలు పంపిణీ చేశారు. ప్రజలు పెంచుకునే మొక్కల్లో తమ స్నేహితుడిని చూసుకుంటామని, తాము కూడా మొక్కలు నాటి పెంచుతామని విద్యార్థులు తెలిపారు.

నేరాల నియంత్రణే లక్ష్యం

● ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌

విజయనగరం క్రైమ్‌: గంజాయి అక్రమ రవా ణాను అడ్డుకోవడం, మహిళల భద్రత, సైబర్‌ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ ఏ.ఆర్‌.దామోదర్‌ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎస్పీకు అడిషనల్‌ ఎస్పీ సౌమ్యలత, ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీనివాస్‌, బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, లీగల్‌ అడ్వయిజర్‌ వై.పరశురాం తదితరులు పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

అధికారులకు దిశానిర్దేశం

ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దామోదర్‌ జిల్లాలో పని చేస్తున్న పోలీస్‌ అధికారులతో జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మహిళలు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. పోలీస్‌ విధులను నిర్వహించడంలో టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు సమష్టిగా ముందుకు సాగాలన్నారు.

ఉపకార వేతనాలకు రిజిస్ట్రేషన్‌

విజయనగరం టౌన్‌: ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి కళాశాల లాగిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కళాశాల లాగిన్‌లో ఆప్షన్‌ ఇచ్చామని సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు డి.వెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పొందేందుకు, ప్రెష్‌, రెన్యువల్‌ విద్యార్థుల వివరాలు ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీ, కాపు, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు అర్హులని పేర్కొన్నారు.

చింతపల్లి తీరంలో వేటసాగక ఒడ్డున నిలిపిన బోట్లు

పూసపాటిరేగ:

విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. సముద్రంలో చేపల వేటపై సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరిలో 6 వేల మంది చేపలవేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడ్డారు. రెండు మండలాల్లో 885 బోట్లలో సుమారు 4 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. జెట్టీ లేకపోవడంతో వేట కష్టాలు వెంటాడుతున్నాయి. తుఫాన్ల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేట సాగిస్తున్నారు. జీవనోపాధి కోసం విశాఖపట్టణం, గుజరాత్‌, హీరావల్‌, సూరత్‌ తదితర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. అక్కడి ఫిషింగ్‌ కంపెనీల్లో నెలల తరబడి పనిచేస్తూ కుటుంబ పోషణ కోసం డబ్బులు పంపిస్తున్నారు. వీరిలో చాలామంది సముద్రంలో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కూడా విడుస్తున్నారు. స్థానికంగా జెట్టీ లేకపోవడమే మత్స్యకారుల బతుకుకు భరోసా కరువైంది.

జెట్టీ నిర్మించేదెప్పుడు?

పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని మత్స్యకారుల జీవన కష్టాలను గుర్తించిన గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చింతపల్లిలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శంకుస్థాపన కూడా చేసింది. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ఉత్తర్వులు మరుగునపడ్డాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణ ప్రక్రియపై నోరుమెదిపేవారే కరువయ్యారు. మత్స్యకారుల కష్టాలు గుర్తించేవారే లేరు. జెట్టీ నిర్మాణంపై ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని మత్స్యకారులు తప్పుబడుతున్నారు. మత్స్యకారుల వలస బతుకులు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వంద రోజుల్లో వంద కంపెనీలు తెస్తామంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్పే పాలకులు కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్లోటింగ్‌ జెట్టీ పనులైనా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ వేట సాగకపోవడంతో సుమారు 3వేల మంది వలసలపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితులు గమనించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

మత్స్యకారుల

కష్టాలు గుర్తించాం..

జిల్లా తీరప్రాంత మత్స్యకారుల కష్టాలను గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. సుమారు 23 కోట్లతో చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్‌ జెట్టీ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా జెట్టీ నిర్మాణం కోసం కనీసం పట్టించుకోకపోవడం విచారకరం. మత్స్యకారులకు జెట్టీ అవసరాన్ని గుర్తించాలి. జెట్టీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. మత్స్యకారులకు జీవన భరోసా కల్పించాలి.

– బడ్డుకొండ అప్పలనాయుడు,

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే

ఎదురు చూస్తున్నాం

చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు జెట్టీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేటకు ఎదురీదుతున్నాం. ప్రభుత్వం స్పందించి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి.

– బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం

ఓ వైపు జెట్టీ లేదు.. మరోవైపు పరిశ్రమల రసాయన వ్యర్థాలు సంద్రంలో కలుస్తుండడంతో పూసపాటిరేగ, భోగాపురం తీరంలో చేపలవేట సాగడం లేదు. ఇక్కడ మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోంది. కొంత కాలం కిందటి వరక వేట అనుకూలించేదని, ప్రస్తుత పరిస్థితి చూస్తే భిన్నంగా ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మిస్తే వేట కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మోక్షగుండంను

ఆదర్శంగా తీసుకోవాలి

విజయనగరం అర్బన్‌: ఇంజినీర్లు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్‌చార్జి వీసీ డి.రాజ్యలక్ష్మి కోరారు. మోక్షగుండం జయంతిని పురస్కరించుకుని వర్సిటీలో సోమవారం ఇంజినీరిండ్‌ డేను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ ఇంజినీర్లు ప్రొఫెషనల్‌గానే కాకుండా సోషల్‌ యాక్టివిటీస్‌లో పాల్గొనాలని కోరారు. దేశాభివృద్ధికి మోక్షగుండం చేసిన కృషిని కొనియాడారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బి.ఉమాశంకర్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సివిల్‌ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ జి.జయసుమ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌.రాజేశ్వరరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ జీజే నాగరాజు, సివిల్‌ విభాగాధిపతి డాక్టర్‌ జి.అప్పలనాయుడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డి.జగన్‌మోహన్‌ పాల్గొన్నారు.

మత్స్యకారులకు సముద్రమే జీవనాధారం. అలలపైనే జీవన గమనం. వేటసాగితేనే నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేదంటే కడలి తీరంలో పస్తుల జీవనం. వరుస తుఫాన్లు వారి బతుకుల్లో అలజడి రేపుతున్నాయి. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇక్కడి మత్స్యకారుల వేట చింత తీర్చేలా, వలసలకు చెక్‌పెట్టేందుకు వీలుగా పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో రూ.23 కోట్లతో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మాణానికి ఉత్తర్వులు జారీచేయడంతో మత్స్యకారుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. మత్స్యకారులు గొంతెత్తి అరుస్తున్నా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జెట్టీ నిర్మాణం గురించి కనీసం పట్టించుకోకపోవడం ఆవేదన నింపుతోంది.

చింతపల్లి తీరంలో జెట్టీ నిర్మాణానికి

గత ప్రభుత్వం చర్యలు

రూ.23 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు

ప్రభుత్వం మారడంతో ఎండమావిగా మారిన ఫ్లోటింగ్‌ జెట్టీ

జెట్టీ నిర్మాణంపై ఊసెత్తని కూటమి సర్కారు

పట్టించుకోని స్థానిక పాలకులు

మత్స్యకారులకు తప్పని వలస బతుకులు

విజయనగరం1
1/5

విజయనగరం

విజయనగరం2
2/5

విజయనగరం

విజయనగరం3
3/5

విజయనగరం

విజయనగరం4
4/5

విజయనగరం

విజయనగరం5
5/5

విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement