
జనసేన మండల అధ్యక్షుడిపై పిర్యాదు
సీతంపేట: సోషల్ మీడియా వేదికగా సర్పంచ్‌లను దుర్భాషలాడినందుకు జనసేన పార్టీ సీతంపేట మండల అద్యక్షుడు మండంగి విశ్వనాథంపై కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేసినట్లు మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సోమవారం తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 73వ రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 243 ప్రకారం రాజ్యాంగం 11వ భాగం ప్రకారం రాజ్యాంగ బద్ధంగా ఎన్నికై గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వ్యవస్థపై అసభ్యపదజాలం, పోస్టింగ్‌లతో కించపరిచే విధంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన విశ్వనాథంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నికై న తాము ఏనాడు పార్టీల పరంగా భేదాభిప్రాయాలు తలెత్తేలా నడుచుకోలేదన్నారు. ఇప్పుడు జనసేన నాయకుడు సర్పంచ్‌లను దొంగనాకొడుకులు అంటూ అసభ్యంగా పెట్టిన పోస్టులు తమ మనోభావాలు పూర్తిగా దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన విశ్వనాథంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, సర్పంచ్‌లు ఎన్.తిరుపతిరావు, కె.వెంకునాయుడు, ఎస్.బాపయ్య, హెచ్.ఆదిలక్ష్మి, జె.సుందరమ్మ, బి.తిరుపతిరావు, ఎస్.ప్రవీణ్, ఇసోని, రాజయ్య, జెడ్‌పీ కోఆప్షన్ సభ్యురాలు ఎస్.లక్ష్మి, ఎంపీటీసీలు ఎస్.చంద్రశేఖర్, ఎస్.మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

జనసేన మండల అధ్యక్షుడిపై పిర్యాదు