
పత్రికా స్వేచ్ఛకు బాబు ఎప్పుడూ వ్యతిరేకమే
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతూనే ఉంటుంది. తనను పొగిడిన పత్రికలంటేనే బాబకు ఇష్టం. తనపైనా, తన పరివారం పై ఏమైనా సత్యాలు రాస్తే మాత్రం కంటగింపు తప్పదు. వారిపై ఎటువంటి చర్యలకై నా సిద్ధమవుతాడు. ఎల్లో మీడియాతో నిజాలను అబద్ధాలు చేయించేందుకు ఎంతకై నా తెగిస్తారు. పోలీసు బాస్‌ల దగ్గర నుంచి కింది స్థాయి వరకు తనకు అనుకూలంగా ఉండేవారిని నియమించుకునేందుకే ప్రాధ్యాన్యమిస్తారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర తెలిసిన వారెవరికై నా ఇది బాగా అర్థం అవుతుంది.
– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే