
సైన్స్‌తోనే సమాజ ప్రగతి
● సమాజ హితమే జేవీవీ లక్ష్యం
విజయనగరం గంటస్తంభం: సైన్స్‌తోనే సమాజ ప్రగతి సాధ్యమని, సైన్స్‌ను విస్తరింపజేయడమే జేవీవీ (జన విజ్ఞాన వేదిక) లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. జేవీవీ 18వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలోని మహా కవి గురజాడ అప్పారావు ఇంటి ప్రాంగణంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జేవీవీ పతాకాన్ని రచయిత అట్టాడ అప్పలనాయుడు, జేవీవీ ప్రతినిధి నారు సింహాద్రినాయుడు ఆవిష్కరించారు. అనంతరం వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గేయానంద్ అధ్యక్షతన జరిగిన సభలో సంఘ అధ్యక్షుడు డి.వి.రమణ మాట్లాడుతూ.. దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని చాటిచెప్పిన నేల విజయనగరం అన్నారు. ఇది ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్రగా అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. గురజాడ అప్పారావు సాక్షిగా మెరుగైన సమాజం కోసం జేవీవీ పని చేస్తుందన్నారు. అనంతరం యుటీఎఫ్ సీనియర్ నాయకులు కె.విజయగౌరీ సావిత్రి జ్యోతిరావు పూలే మీద రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చిన్న శ్రీను సోల్జర్స్ చైర్మన్ సిరి సహస్త్ర ‘ప్రపంచ శాంతి కోసం సైన్స్(జ్ఞాపిక)’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. జేవీవీలో పని చేస్తున్నవారంతా సీనియర్ ఉద్యమ నాయకులేనన్నారు. దేశం నాలెడ్జ్ హబ్‌గా ఉంది. అక్షరాస్యత ఎంతో పెరిగింది. మనం ఎందుకు వెనుకబాటులో ఉన్నామో అనేది ప్రజలను చైతన్యం చేయాల్సి ఉందన్నారు. మహిళలు, యువ త సమర్థవంతంగా పనిచేస్తే దేశాభివృద్ధి సాధ్య మన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల కోసం సైన్స్... ప్రగతి కోసం సైన్స్ అనే నినాదంతో సామాన్య మానవుడికి శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానాన్ని తెలియజేసేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేయడం అభినందనీయమన్నారు. వైజ్ఞానిక పరమైన జ్ఞానం, మానవత విలువలతోనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు. యువతలో ప్రశ్నించే గుణం పెరగాలని, ప్రశ్నించని బతుకు గడ్డి పరకతో సమానమన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్మి, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లా డుతూ కళలకు కాణాచిగా పేరుగాంచిన విజయనగరంలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మెరుగైన సమాజం కోసం శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వం గురజాడ నివాసాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలని కోరారు.