యూరియా ఎక్కడ బాబూ.. | - | Sakshi
Sakshi News home page

యూరియా ఎక్కడ బాబూ..

Sep 14 2025 6:15 AM | Updated on Sep 14 2025 6:15 AM

యూరియ

యూరియా ఎక్కడ బాబూ..

రాజాం సిటీ/సంతకవిటి/తెర్లాం/గుర్ల:

కూటమి ప్రభుత్వ తీరుతో రైతన్నను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లు, ప్రైవేటు దుకాణాలకు తిరిగితిరిగి వేసారిపోతున్నారు. గంటల తరబడి పస్తులతో క్యూ కడుతున్నారు. డబ్బులిచ్చి కొనుగోలుచేసుకునే యూరియాను సైతం అవసరం మేరకు ప్రభుత్వం సరఫరా చేయలేకపోవడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. రైతుల ఓపిక నశించడంతో రాజాం పట్టణంలోని శ్రీకాకుళం రోడ్డులో ఉన్న మనగ్రోమోర్‌ దుకాణం ముందు శనివారం బైఠాయించారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువు కొరతలేదని ఏసీ రూమ్‌లలో కూర్చొని చెబుతున్న సీఎం చంద్రబాబునాయుడు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌కు రైతుల బాధలు ఏం తెలుసంటూ మండిపడ్డారు. ఇదిగో యూరియా వస్తుంది, అదిగో వస్తుందని ప్రకటనలు చేస్తున్న నాయకులకు అన్నదాతలు ఆక్రందన కనపడడం లేదన్నారు. ప్రభుత్వం సక్రమంగా యూరియా సరఫరా చేస్తే పనులు మానుకుని ఇలా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదును దాటిన తరువాత ఎరువు ఇస్తే ఏం ప్రయోజనం ఉంటుందని మండిపడ్డారు. మాకేమైనా ఊరికే ఎరువులు ఇచ్చి ఉద్దరిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సంక్షేమం పట్టని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాయకులకు మా బాధలు కనబడడం లేదు

యూరియా కొరతలేదని స్టేట్‌మెంట్లు ఇస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌లకు మా రైతులు పడుతున్న బాధలు కనపడడంలేదు. ఏసీ రూమ్‌లలో ఉండి స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంకాదు. రైతుల పరిస్థితి చూసి మాట్లాడాలి. అదును దాటిన తరువాత యూరియా సరఫరాచేస్తే ఏం ప్రయోజనం ఉటుంది.

– జి.నారాయణరావు, రైతు, పొనుగుటివలస

8 రోజులుగా తిరుగుతున్నా...

ఒకబస్తా యూరియా కోసం ఎనిమిది రోజులుగా తిరుగుతున్నాం. మా గ్రామంలో ఆర్‌ఎస్‌కే వద్ద అరకొరగా పంపిణీ చేశారు. రాజాంలోని ప్రైవేటు దుకాణాల వద్దకు ప్రతి రోజు రావడం, యూరియా దొరకక తిరుముఖం పట్టడం పరిపాటిగా మారింది.

– బలగ గణేష్‌, రైతు,

పెనుబాక, రాజాం మండలం

ఎన్ని రోజులు తిరగాలి..

ప్రభుత్వం రైతులకు అవసరం మేరకు ఎరువులు సరఫరా చేయడంలేదు. ఆర్‌ఎస్‌కేల ద్వారా అందించక పోయింది. ప్రతిరోజూ ప్రైవేటు దుకాణాల వద్దకు తిరగాల్సి వస్తోంది. నాలుగు ఎకరాల వరి పంట సాగుచేశాను. యూరియా కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నా దొరకలేదు. పంటలను కాపాడుకోలేక విషం తాగి చావడమే మిగిలింది.

– మక్క శేషగిరిరావు, రైతు,

పెంట గ్రామం, జి.సిగడాం

ఎప్పుడిస్తారో తెలియదు...

యూరియా కోసం రాజాంలోని ప్రైవేటు దుకాణం వద్దకు నాలుగు రోజులుగా తిరుగుతున్నాను. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా ఒక బస్తా యూరియా అందుతుందని ఆశపడుతున్నాను. ఈ రోజు రాజాం మండలం వారికే ఇస్తామన్నారు. ఆ విషయం ముందురోజే చెబితే ఇంత దూరం రాకపోయి ఉండేవాడిని.

– సీహెచ్‌ అప్పారావు, రైతు,

పణుకువలస, తెర్లాం మండలం

గుర్లలో...

గుర్ల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ దుకాణంలో యూరియా పంపిణీ చేస్తున్నట్టు తెలుసుకున్న గోషాడ, గుర్ల, కెల్ల, చింతలపేట, పకీరు కిట్టాలి, గుజ్జింగివలస, వల్లాపురం, జమ్ము, కలవచర్ల, గరికివలసకు చెందిన సుమారు 400 మంది రైతులు శనివారం తరలివచ్చారు. 200 మందికి మాత్రమే ఎరువులు అందడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు.

అదిగదిగో వేలటన్నుల ఎరువు

వచ్చేస్తోందంటూ అనుకూల

మీడియాలో ప్రచారం

రైతులను మభ్యపెట్టేయత్నం

సమయం మించిపోతున్నా బస్తా యూరియా దొరకని వైనం

రాజాం, తెర్లాం, సంతకవిటి, గుర్లలో రోడ్డెక్కిన రైతన్నలు

టోకెన్ల కోసం తోపులాటలు

రాజాం–శ్రీకాకుళం రోడ్డుపై

బైఠాయించి ఆందోళన

యూరియా ఎక్కడ బాబూ.. 1
1/5

యూరియా ఎక్కడ బాబూ..

యూరియా ఎక్కడ బాబూ.. 2
2/5

యూరియా ఎక్కడ బాబూ..

యూరియా ఎక్కడ బాబూ.. 3
3/5

యూరియా ఎక్కడ బాబూ..

యూరియా ఎక్కడ బాబూ.. 4
4/5

యూరియా ఎక్కడ బాబూ..

యూరియా ఎక్కడ బాబూ.. 5
5/5

యూరియా ఎక్కడ బాబూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement