
ఐదుగురికి నక్క కాటు
● చివరకు నక్కను చంపేసిన బాధితుడు
సంతకవిటి: మండలంలోని అక్కరాపల్లి గ్రామానికి చెందిన ఎమ్.లక్ష్మి, కె.సూరయ్య, వి.లచ్చమ్మ, బూ రాడపేట గ్రామానికి చెందిన బంటుపల్లి చిన్నోడు, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామానికి చెందిన కె.జగన్‌మోహన్‌లకు నక్క కాటేసింది. వీరు సంతకవిటి పీహెచ్‌సీకి రావడంతో వేక్సినేషన్ వేసినట్టు వైద్యాధికారి యు. నాగేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. కె.జగన్‌మోహన్ రాజాం స్కూటిపై వెళ్తుండగా సంతకవిటి సమీపంలో నక్క దాడి చేసి కాటు వేసింది. అక్కరాపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు సంతకవిటి నుంచి అక్కరాపల్లి వెళ్తుండగా సంతకవిటి సమీపంలోనే అకస్మాత్తుగా దాడి చేసి గాయపరిచింది.
నక్కతో పోరాటం
బూరాడపేట గ్రామానికి చెందిన బంటుపల్లి చిన్నోడుకు సంతకవిటిలోని భాను ఫిల్లింగ్ స్టేషన్ వద్ద అకస్మాత్తుగా నక్క దాడి చేసి దాదాపు 30 నిమిషాలు కాలును పట్టేయడంతో నక్కపై కూర్చొని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. స్థానికులు కూడా చూసి భయపడి కాసేపట్లో తేరుకుని నక్కను చంపడంతో చిన్నోడుకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం చిన్నోడు పీహెచ్‌సీకి వెళ్లి వ్యాక్సినేషన్ వేసుకున్నారు.