
పత్రికలపై కక్షసాధింపు హక్కుల హననమే...
దినపత్రిక సంపాదకునిపై అక్రమ కేసులు పెట్టడం అంటే రాజ్యాంగ హక్కులను హననం చేయడమే. పత్రికలో వచ్చిన వార్త విషయంలో పోలీసులు ఏకంగా ఎడిటర్‌పై పొలీసు కేసు నమోదు చేయడాన్ని ప్రజాసామ్యవాదులెవరైనా ఖండించాల్సిందే. ప్రజాప్రతినిధి ఆరోపణల వ్యాఖ్యలను ప్రచురించిన విషయంలో అభ్యంతరాలుంటే అదే పత్రికా ముఖంగా ఖండించాలేగానీ పోలీసు కేసులు పెట్టడం సమంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదు.
– జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్