
అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా రామ్‌నరేష్
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా బి.రామ్‌నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ బి.అప్పలరాజు ఉద్యోగవిరమణ పొందడంతో ఆయన స్థానంలో విధుల్లో చేరారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ డీఎఫ్‌ఓ, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటవీశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
విజయనగరం లీగల్: జిల్లాలో ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయలోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీఅయ్యేలా చూడాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ, ఎకై ్సజ్, భూ సంబంధిత కేసులు, కుటుంబ తగాదాలు, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరువర్గాల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు.
ఐస్‌బండితో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఐస్‌బండితో చెట్టును ఢీకొట్టి బుధవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) ఐస్ బండి నడుపుతూ జీవనం కొససాగిస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం సుంకరిపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనాన్ని చూసి పక్కకు తప్పించబోయి చెట్టును ఐస్ బండితో చెట్టునుకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కొడుకు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ చెప్పారు.

అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా రామ్‌నరేష్

అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా రామ్‌నరేష్