
స్కూల్‌గేమ్స్ పోటీల్లో సత్తా చాటాలి
● డిప్యూటీ డీఈఓ కె.వెంకటరమణ
● రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక ప్రారంభం
విజయనగరం: రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరగబోయే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో సత్తా చాటాలని డిప్యూటీ డీఈఓ కె.వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో నిర్వహించే స్కూల్‌గేమ్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలను బుధవారం ఆయన నగరంలోని పీఎస్‌ఆర్ స్కూల్‌లో ప్రారంభించారు. టేబుల్ టెన్నిస్, మాల్కంబ క్రీడాంశాల్లో అండర్–14,17 విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో టేబుల్‌టెన్నిస్ క్రీడాంశంలో 20 మంది, మాల్కంబ క్రీడాంశంలో 16 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు అర్హత సాధించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తాయన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక పోటీలను టేబుల్‌టెన్నిస్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, విజయనగరం డివిజన్ ఇన్‌చార్జి తవిటయ్య, రత్నకిషోర్, శ్రీను, రవి, ప్రవీణ్, శ్రీకాంత్‌లు పర్యవేక్షించారు.
సెపక్‌తక్రా పోటీల్లో 20 మంది ఎంపిక
నెల్లిమర్ల మండలం అలుగోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన సెపక్‌తక్రా అండర్–14,17 బాల, బాలికల ఎంపిక పోటీల్లో 20 మంది జిల్లా జట్టుకు అర్హత సాధించారు. ఎంపిక పోటీల్లో మొత్తం 50 మంది క్రీడాకారులు పాల్గొనగా..పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ధర్మారావు పర్యవేక్షణలో ఎంపికలు జరిగాయి. జిల్లా జట్టుకు అర్హత సాధించిన క్రీడాకారులు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లనున్నారు. ఎంపిక పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు సూర్యారావు తదితరులు పర్యవేక్షించారు.

స్కూల్‌గేమ్స్ పోటీల్లో సత్తా చాటాలి

స్కూల్‌గేమ్స్ పోటీల్లో సత్తా చాటాలి