
ఆటో బోల్తా పడి ఒకరి మృతి
గుర్ల: మండలంలోని పెద్దబంటుపల్లి ప్రధానరహదారిలో బుధవారం ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలకు మేరకు..మెరకముడిదాం నుంచి గరివిడి వస్తున్న ఆటోకు పెద్దబంటుపల్లి వద్ద అడ్డంగా కుక్క రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మెరకముడిదాం మండలం సింగవరం గ్రామానికి చెందిన మన్యపురి తవిటినాయుడు (59) మృతి చెందాడు. గాయాలపాలైన ముగ్గురిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రేగిడి:
మండల పరిధిలోని అంబాడ గ్రామానికి చెందిన ముడిదాన కిరణ్ (6) తీవ్ర జ్వరంతో మృతిచెందాడని ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న కిరణ్ మృతి వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులను హెచ్‌ఎం మీసాల సత్యంనాయుడుతో కలిసి ఆయన పరామర్శించారు. వేకువజామున నాలుగు గంటల సమయంలో గుండెలో నొప్పి వచ్చిందని, అనంతరం వాంతులు కావడంతో అపస్మారకస్థితికి చేరుకోగా కుటుంబ సభ్యులు రాజాం కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతిచెందాడని వైద్యులు తెలిపారని ఎంఈఓ పేర్కొన్నారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు ఎం.సింహాచలం, డి.ప్రసాద్, బాలుడు తండ్రి జోగినాయుడు తదితరులు పరామర్శలో పాల్గొన్నారు.
గాయాల పాలైన వారికి
సపర్యలు చేస్తున్న
పెద్దబంటుపల్లి గ్రామస్తులు
మరో ముగ్గురికి గాయాలు

ఆటో బోల్తా పడి ఒకరి మృతి