
విజయనగరం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కురుపాంలోని గిరిజన ఇంజినీరింగ్ కళాశాల పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు, గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. –8లో
కొమరాడ: మండలంలోని పూడేస్, కుంతేస్, మసిమండ, పెదశాఖ, గుణదతీలేస్, చోళ్లప దం తదితర పంచాయతీల్లోని పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. గిరిజనలు ఆనారోగ్యానికి గురైతే డోలీ మోతలే శరణ్యం. నాలుగు రోజుల కింద పా లేం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్ అస్వస్థతకు గురైతే డోలీలో రాళ్లదారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారిగూడ వర కు మోసుకొచ్చి అక్కడ నుంచి ఆటోలో కురుపాం పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం 108లో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.
పల్లె పండగ పేరుతో రోడ్లన్నీ బాగుచేస్తామన్నారు.. గిరిజన ప్రాంతాల్లోని రాళ్లదారులన్నింటినీ అద్దంలా మెరిసిపోయే రోడ్లుగా నిర్మిస్తామన్నారు.. రాకపోకలకు కష్టాలు లేకుండా చేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా గిరిజన ప్రాంతాల్లో రాళ్లదారులే దర్శనమిస్తున్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు విద్య, వైద్య కష్టాలు షరా మామూలుగా మారాయి. అత్యవసర వేళ రాళ్లదారుల్లో కిలోమీటర్ల మేర డోలీలోనే రోగులను తరలించాల్సిన దుస్థితి. గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాక గిరిజన గూడల్లో వైద్య కష్టాలు అధికమయ్యాయి. డోలీమోతలు నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇటీవల వైద్యం కోసం గిరిజనుల పాట్లే నిలువెత్తు నిదర్శనం.

విజయనగరం