
పొలం గట్లపై మూడు కిలోమీటర్లు...
బొబ్బిలిరూరల్: మండలంలోని గోపాలరా యుడుపేట పంచాయతీ పరిధిలోని మోసేవల స గ్రామానికి చెందిన చోడిపల్లి ఆశమ్మ క్యాన్స ర్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందిన ఆమె గ్రామానికి చేరుకుంది. మలివిడత చికిత్స కోసం బుధవా రం డోలీలో పొలంగట్లపై నుంచి మూడు కిలోమీటర్లమేర మోసుకుంటూ ఆమె బంధువులు నారశింహునిపేట వద్దకు చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా యాతన తప్పడం లేదంటూ గ్రామస్తులు వాపోయారు. కనీసం రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు.