
మెరకముడిదాం పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూ కట్టిన మహిళా రైతులు
రైతులను ఎరువు కష్టాలు వీడడంలేదు. అధికారులు అధిగోఇదిగో అంటున్నా రైతుకు ఎరువు లభించడంలేదు. దీనికి మెరకముడిదాం మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద బుధవారం కనిపించిన ఈ చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. పీఏసీఎస్‌లో ఎరువులు పంపిణీ చేస్తారన్న సమాచారం మేరకు ఉదయాన్నే రైతులు అక్కడకు చేరుకున్నారు. తమ తమ ఆధార్‌కార్డు, భూమికి చెందిన వన్‌బీ జెరాక్స్‌లను వరుసగా పెట్టి అధికారులు వచ్చేంతవరకు వేచిచూశారు.
అధికారులు 9.30 గంటలకు రావడంతో తమ జెరాక్స్‌లు పెట్టిన స్థానంలో రైతులు క్యూ కట్టారు. ఎరువుకోసం ఇన్ని కష్టాలు గత ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదని, డబ్బులిచ్చి కొనుగోలుచేసుకునే ఎరువును కూడా కూటమి ప్రభుత్వం సరఫరా చేయకపోవడంపై మండిపడ్డారు. ఒక్కో రైతుకు ఒక బస్తాయే ఇవ్వడంతో నిరాశచెందారు. – మెరకముడిదాం