చీపురుపల్లి: పట్టణంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీల నుంచి రూ. 1,47,173లు ఆదాయం లభించినట్టు దేవస్థా నం ఈఓ బి.శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి దేవస్థానంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ జి. శ్యామ్‌ప్రసాద్ నేతృత్వంలో 2025 జూలై 16 నుంచి 2025 సెప్టెంబర్ 10 వరకు భక్తులు హుండీలలో వేసిన కానుకలను బుధవారం లెక్కించారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు గవిడి నాగరాజు, పొట్నూరు త్రినాథ రావు, లెంక చిన్నారావు, ఇప్పిలి పార్వతి, ఇల్లాపు ఆది, తదితరులు పాల్గొన్నారు.
కొత్త బాధ్యతలు
విజయనగరం: రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్‌సీపీ సంస్థా గత నియామకాలను చేపట్టింది. మాజీ ముఖ్య మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణికి బాధ్యతలు అప్పగించింది. అలాగే రాష్ట్ర ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా గజపతినగరం నియోజవర్గానికి చెందిన ఎస్. శ్రీనివాసరావును నియమించింది. వీరికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఆగని జిందాల్ పోరు
శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితులు తమ పోరుబాటను కొనసాగిస్తున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి బుధవారం ధర్నా చేయగా, స్థానికంగా ఉన్నవారు బొడ్డవరలో యథావిధిగా తమ ఆందోళన కొనసాగించారు. కూటమి నేతలు కొర్పొరేట్ శక్తులకు దాసోహమయ్యారంటూ విమర్శించారు. జిందాల్‌కు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చివేయాలంటూ నినదించారు.