
దాడికారణంగానే వాచ్‌మన్ మృతి
రాజాం సిటీ:
మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామానికి చెందిన వాచ్‌మన్ కోడూరు ముత్యాలనాయుడిపై లారీ డ్రైవర్లు చేసిన దాడి కారణంగానే మృతిచెందాడని రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముత్యాలనాయుడు మృతికి కారకులైన ఇద్దరు లారీ డ్రైవర్లను అరెస్టుచేశామని తెలిపారు. స్థానిక పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ రైస్‌మిల్లు వద్ద ముత్యాలునాయుడు వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 14 మిల్లు వద్దకు లారీ డ్రైవర్లు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం చిర్లుపాలెం గ్రామానికి చెందిన బూర్లె నాగరాజు, కోరాడ చిన్నప్పడులు రెండు లారీల ఊక ఎత్తుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ మద్యం తాగుతుండగా వారించిన వాచ్‌మన్‌పై విచక్షణా రహితంగా డ్రైవర్లు దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడడంతో వాచ్‌మన్ తొడ ఎముక విరిగిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని చెప్పారు. కార్యక్రమంలో సంతకవిటి ఎస్సై ఆర్.గోపాలరావు, సిబ్బంది ఉన్నారు.