
ఆలయాల మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామివారి దేవస్థానాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం మధ్యాహ్నం మూసి వేశారు. పైడితల్లి ఆలయాన్ని సోమవారం ఉదయం 8.30 గంటలకు తెరవనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. రామతీర్థంలో వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన పూజలు జరిపించిన అనంతరం నిత్య కై ంకర్యాలను పూర్తి చేసి ఆలయ తలుపులను మూసివేశారు. రామతీర్థంలో శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానాన్ని సోమవారం ఉదయం గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి 11.30 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని రామతీర్థం ఆలయం ఈవో వై.శ్రీనివాసరావు తెలిపారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం/నెల్లిమర్ల రూరల్

ఆలయాల మూసివేత

ఆలయాల మూసివేత