
●అమ్మవారికి ఆషాఢం సారె
విజయనగరంలోని పెద్దచెరువు ఉత్తర గట్టుపై ఉన్న శ్రీవిజయసాగర దుర్గామల్లేశ్వరమ్మ వారికి ఆషాఢం సారెను ఆదివారం సమర్పించారు. హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారికి భక్తులు ఉదయం పసుపు, కుంకుమలు అందజేసి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఏడు ఎడ్ల బండ్లపై కొబ్బరి బొండాలు, వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పూలతో కోట వద్ద నుంచి ర్యాలీగా వెళ్తూ సారెను ఊరేగించారు. బాజాభజంత్రీలు, మేళతాళాలు, విచిత్ర వేషధారణల ప్రదర్శన నడుమ సాగిన ఈ కార్యక్రమం అందరిలో ఆధ్యాత్మిక భావం పెంపొందించింది. భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకుడు కొండబాబు, ప్రతినిధులు మీనమ్మ, స్రవంతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం టౌన్

●అమ్మవారికి ఆషాఢం సారె

●అమ్మవారికి ఆషాఢం సారె