
కొలువుల కాణాచి జేఎన్‌టీయూఈ కళాశాల
● తొమ్మిదేళ్లలో 1714 మందికి ప్లేస్‌మెంట్ ● రెండేళ్ల క్రితం నుంచి జాతీయ నూతన విద్యా విధానం అమలు ● ఇంజినీరింగ్ హానర్స్ డిగ్రీ కొనసాగింపు ● ఈ ఏడాది నుంచి మైనర్ సబ్జెక్ట్‌గా క్వాంటం కంప్యూటర్
ఉద్యోగ సాధనకు కళాశాలలో నైపుణ్యాలు పుష్కలం
జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) 2024–25 విద్యా సంవత్సరంలో పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే గేట్ ద్వారా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్)లో సీనియర్ ఆఫీసర్–సీ పోస్టు సాధించా ను. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే సాధించగలిగాను. ప్రత్యేకించి ఉన్న ప్లేస్‌మెంట్ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం లభించింది.
–వానపల్లి లలితాప ప్రదీప్ కుమార్
విజయనగరం అర్బన్:
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల సందడి తాజాగా మొదలైంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రమాణాలున్న కళాశాలలను ఎంపిక చేసుకొనే పనిలో ఇంజినీరింగ్ అభ్యర్థులు బిజీగా ఉన్నా రు. నగర శివారున ఉన్న జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఉద్యోగ కల్పనలో ముందు వరుసలో ఉంది. రెండేళ్ల నుంచి నూతన విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చింది. మరో వైపు ఉన్నత విద్య శాఖ ఈ కళాశాల ప్రాంగణంలోనే జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థుల నైపుణ్యాలను పెంచే విధంగా మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో హానర్స్, మైనర్ పేరుతో విస్తరణ డిగ్రీలను గత ఏడాది నుంచి ప్రవేశ పెడుతుంది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలులోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్‌తో పాటు పది నెలల ఇంటర్న్‌షిప్ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఐటీ, మెకానికల్ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలర్జికల్ సబ్జెక్టు డిగ్రీలలో 33 సీట్లు వంతున కోర్సులను నిర్వహిస్తుంది.
ఇంజినీరింగ్ హానర్స్ డిగ్రీ
విద్యార్థుల సామర్థ్యాల స్థాయికి అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యధావిధిగా సాధారణ బీటెక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్‌తో పాటు ఇతరేత్ర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్టు నిర్ధారించుకున్న వారికి హానర్ డిగ్రీ ప్రకటిస్తారు. ఇందు కోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్‌లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలిత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్టర్లలో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకేసారి ఉత్తర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్ అయిన విద్యార్థిని హానర్ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్ వరకు కనీసం 160 క్రెడిట్ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్ పాయింట్లు తెచ్చుకోవాలి.
ఇంజినీరింగ్ మైనర్ డిగ్రీ
నూతన విద్యా విధానం అమలులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగు పరిచే విధంగా మైనర్ డిగ్రీని ప్రవేశ పెట్టారు. చేరిన డిగ్రీకి చెందిన ప్రధాన సబ్జెక్టుతో పాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో మరో సబ్జెక్టులలో కూడా ప్రతిభ చూపాలనుకొనే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్ ఫలితాలలో 80 శాతం పాయింట్లను తెచ్చుకున్న వారికి మైనర్ డిగ్రీ కోర్సులకు రిజస్టర్ చేయిస్తారు.
తొమ్మిదేళ్లలో 1714 మందికి ప్లేస్‌మెంట్
ఈ ఏడాది నుంచి మైనర్ సబ్జెక్ట్‌గా క్వాంటం కంప్యూటర్
ఉద్యోగ, ఉపాధి అధికంగా ఉన్న క్వాంటం కంప్యూటర్ సబ్జెక్టును ఈ ఏడాది నుంచి మైనర్ సబ్జెక్టుగా ప్రవేశ పెడుతున్నాం. నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నాం. దేశ విదేశాల సంస్థల్లో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థులకు గ్లోబలైజ్డ్ నైపుణ్యాలపై మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 13 ప్రతిష్టాత్మక కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం.
– ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరం
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో 2007లో ప్రారంభం అయిన ఈ కళాశాల తొలి బ్యాచ్ నుంచి తాజాగా రిలీవ్ అయిన బ్యాచ్ వరకు ప్రతి ఏడాదిలోనూ ప్లేస్‌మెంట్లు తెచ్చి పెట్టింది. దినదినాభివృద్ధిగా మౌలిక సదుపాయాలు, బోధనా సామర్థ్యాలను పెంచుకుంటుంది. రిలీవ్ అయిన తొమ్మిది బ్యాచ్‌ల నుంచి 1714 మంది విద్యార్థులకు ఉద్యోగాలొచ్చాయి. వివిధ కంపెనీలలో అత్యధికంగా రూ.18 లక్షల వార్షిక వేతన ఉద్యోగాలతో పాటు గ్యాట్ ద్వారా ప్రతి ఏడాదిలోనూ ఉద్యోగాలను ఈ కళాశాల ఇప్పించింది.

కొలువుల కాణాచి జేఎన్‌టీయూఈ కళాశాల

కొలువుల కాణాచి జేఎన్‌టీయూఈ కళాశాల

కొలువుల కాణాచి జేఎన్‌టీయూఈ కళాశాల

కొలువుల కాణాచి జేఎన్‌టీయూఈ కళాశాల

కొలువుల కాణాచి జేఎన్‌టీయూఈ కళాశాల