వామ్మో..రేడియేషన్..!
విద్యుదయస్కాంత
తరంగాలతో..
సెల్‌ఫోన్ నుంచి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల వల్ల గర్భిణులు, చంటి పిల్లలకు చాలా ప్రమాదం ఉంది. గర్భంలో శిశువు ఎదుగుదలకు అడ్డుగా మారి, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం తదితర పరిణామాలు ఉంటాయి. సెల్ టవర్లు ఉన్న ప్రాంతంలో ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి.
డాక్టర్. వై.సతీష్ కుమార్, ఫిజిక్స్ లెక్చరర్
విజయనగరం గంటస్తంభం:
విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన సెల్ టవర్లతో ప్రజలు రేడియేషన్ బారిన పడుతున్నారు. 3ఎ, 4ఎ, 5ఎ అని సిగ్నల్స్ కోసం వివిధ రకాల మొబైల్ కంపెనీలు విచ్చలవిడిగా జనవాస ప్రాంతాలలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధానంగా దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఉన్న ప్రదేశాలకు దూరంగా వాటిని నిర్మించాలనే నిబంధనను తుంగలోకి తొక్కి ఇష్టానుసారం నిర్మిస్తున్నారు.
వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులకు ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మానవ శరీరంలో నిత్యం అనేక కణాలు నూతంగా పుడుతుంటాయి కొన్ని మరణిస్తూ ఉంటాయి. సక్రమంగా కణ విచ్ఛిత్తి జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.
గాడి తప్పుతున్న కణ విచ్ఛిత్తి
ఈ రేడియేషన్ వల్ల కణ విచ్ఛిత్తి గాడి తప్పి కణాలు ప్రవర్తించడం వల్ల క్యాన్సర్ కణుతులు ఏర్పడి మనిషి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతున్నాయి. ఈ టవర్లు ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు మొబైల్ కంపెనీలు ఇచ్చే అద్దెలకు, వారు ఇచ్చే ఆఫర్లకు ఆశ పడి వాటి వల్ల వచ్చే ప్రమాదాలను ఊహించలేక పోతున్నారు. వైర్‌లెస్ టెక్నాలజీ పెరిగి మనిషి జీవితం సుఖవంతవుతుందని ఆనందంపడాలో రేడియేషన్ వల్ల వచ్చే వివిధ రకాల భయంకరమైన క్యాన్సర్ తదితర రోగాలతో బాధ పడాలో అర్థం కాని అయోమయ స్ధితిలో నేటి యువతరం ఉంది. రేడియేషన్ వల్ల చర్మ సంబంధ వ్యాధులతో పాటు, కళ్లు ఎర్రబడడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, జుట్టు ఊడిపోవడం, పురుషులకు సంతాన సామర్ధ్యం తగ్గిపోవడం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటికో సుగర్ వ్యాధి బాధితులు ఉన్నట్లయితే భవిష్యత్‌లో క్యాన్సర్ వ్యాధి బాధితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మానవులు, వన్యప్రాణులపై మొబైల్ టవర్ల ప్రభావం


