
అక్రమ రవాణాకు మార్గం!
అక్రమ రవాణాపై మరింత నిఘా..
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై మరింత నిఘా మండల బోర్డర్‌లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ రాష్ట్రాలు ఉడడం వల్ల మండలం మీదుగా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. కొట్టక్కి పోలీస్ చెక్‌పోస్టు, స్థానిక బైపాస్ రోడ్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశాం. ఏ విధమైన అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం.
వి ప్రసాదరావు, ఎస్సై, రామభద్రపురం
రామభద్రపురం: మండలకేంద్రంలోని జాతీయ రహదారి మీదుగా నిషేధిత వస్తువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా రూ.96 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లను రామభద్రపురం పంచాయతీ కార్యాయం వద్ద స్థానిక పోలీసులతో పాటు విజిలెన్స్, వాణిజ్యపనుల శాఖాధికారులు శనివారం పట్టుకున్న విషయం విదితమే. రామభద్రపురం మండల కేంద్రం అంతరరాష్ట్ర కూడలి కావడంతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్టాలకు బోర్డర్‌లో ఉన్నందున ఈ మండల కేంద్రం మీదుగా గంజాయి, ఖైనీ గుట్కా, నల్లమందు వంటి మాదక ద్రవ్యాలతో నిషేధిత వస్తువులు అక్రమ రవాణా సులభతరమవుతోంది.
పదినెలల్లో అక్రమ రవాణా జరిగిన కొన్ని
సంఘటనలు..
గతేడాది జూన్ 16వ తేదీన స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఒడిశా రాష్ట్రం కొరాపుట్ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి విజయవాడకు అక్రమ రవాణా చేస్తున్న కిలోన్నర గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
● గతేడాది ఆగస్టు 16వ తేదీన కొట్టక్కి చెక్ పోస్టు వద్ద అక్రమంగా ఒడిశా నుంచి తరలిస్తున్న రెండున్న కిలోల గంజాయి పట్టుకున్నారు.
● గతేడాది అక్టోబరు 7న మండలంలోని ముచ్చర్లవలస పరిధిలో గల పెట్రోల్ బంకు సమీపంలో గల రాజస్థాన్ డాబా వద్ద ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి నల్లమందు పట్టుకున్నారు
● గతేడాది డిసెంబర్ 12న కొట్టక్కి చెక్ పోస్టు వద్ద ఒడిశా నుంచి సాలూరు, రామభద్రపురం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న 800 కిలోల గంజాయి పట్టుకున్నారు.
● ఈ ఏడాది ఫిబ్రవరి 10న 150 కిలోల గంజాయి కొట్టక్కి పోలీస్ చెక్‌పోస్టు వద్ద పట్టుబడింది.
కూటమి ప్రభుత్వం వచ్చాకే అధికంగా అక్రమ రవాణా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాదక ద్రవ్యాలతో పాటు పలు నాసిక రకం వస్తువుల అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
రామభద్రపురం మీదుగా నిషేధిత వస్తువుల రవాణా

అక్రమ రవాణాకు మార్గం!