
రోడ్డున పడుతున్నాం
నాతో పాటు భార్య పేరున అగ్రిగోల్డ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాను. రూ.10వేల చొప్పున రెండు సార్లు డబ్బులొచ్చాయి. రూ.20వేల డిపాజిట్ల చెల్లింపు సమయంలో నా ఖాతాలోకి నగదు రాలేదు. ఒకటికి మించి బాండ్లు కలిగిన వారిలో చాలామంది నష్టపోయారు. కూటమి ప్రభుత్వం స్పందించి డిపాజిట్ డబ్బులు చెల్లించే ఏర్పాట్లు చేయాలి.
– సిడగం గురునాయుడు, విజయనగరం
ఒక బాండుకే డబ్బులు..
రూ.5 లక్షల డిపాజిట్ చేశాను. రూ.10 వేల చొప్పన రెండు సార్లు డబ్బులొచ్చాయి. రూ.50 వేలు, రూ. లక్ష విలువైన బాండ్లకు నేటికీ డబ్బులు ఇవ్వలేదు. కుటుంబాలతో రోడ్డున పడుతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి.
– జె.ఆదినారాయణ, విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లాలోని
అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య
1,08,470
చేసిన డిపాజిట్ల మొత్తం విలువ
రూ.765కోట్లు (సుమారుగా)
రూ.5 లక్షల చొప్పున
ఎక్స్‌గ్రేషియో
అందినది..
ఇద్దరికి
చనిపోయిన
అగ్రిగోల్డ్
బాధితుల
సంఖ్య
16
విజయనగరం గంటస్తంభం:
అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఊరూరా గొప్పగా ప్రచారం చూశారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారం చేపట్టి ఏడాది గడిచినా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పట్టించుకోవడంలేదు. వారి గోడు వినిపించుకోవడం లేదు. 2014–19 మధ్యకాలంలో ఇలాగే మోసపోయామని, మళ్లీ మరోసారి సీఎం చంద్రబాబునాయుడు తమను మోసం చేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
● ఆదుకున్న గత ప్రభుత్వం
2014 నుంచి ఐదేళ్లపాటు అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలంటూ పోరాటం సాగించారు. అయినా ఫలితం కనిపించలేదు. దాచుకున్న డబ్బులు రావనే బెంగతో జిల్లాలో 16 మంది చనిపోయారు. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. రూపాయి డబ్బులు చెల్లించే ఏర్పాటుచేయలేదు. 2019 ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ వివాదం ప్రధానాంశంగా మారింది. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు దశలవారీగా డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు రెండు దశల్లో రూ.929.75 కోట్లు చెల్లించారు. మొత్తం 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఆ డబ్బు అందగా, జిల్లాలో 20వేల లోపు డిపాజిట్ చేసిన 70 వేల మందికి రూ.36,97,96,900లు లబ్ధిచేకూరింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు.
● న్యాయంచేసేది ఎప్పుడు?
అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాని ఊసే లేదు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఏ ఒక్క చర్య కూడా ప్రారంభించలేదు. కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కాలయాపన తప్ప..11 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడైనా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు న్యాయం చేకూరే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అగ్రిగోల్డు బాధితులను ఆదుకోని కూటమి సర్కారు
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రూపాయి ఇవ్వని వైనం
బాధితుల గోడును పట్టించుకోని
పాలకులు
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.929.75 కోట్ల చెల్లింపు
జిల్లాలో 70వేల మంది బాధితులకు లబ్ధి