ప్రమాదంలో మానవ మనుగడ.! | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో మానవ మనుగడ.!

May 22 2025 12:51 AM | Updated on May 22 2025 12:51 AM

ప్రమాదంలో మానవ మనుగడ.!

ప్రమాదంలో మానవ మనుగడ.!

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి, కృత్రిమ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. ప్రస్తుతం ప్రకృతి వైద్యంలో కూడా మన పాత ఆచారాలే ఉంటున్నాయి. ప్రకృతి, తోటి జీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

ఆర్‌వీజే నాయుడు, పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్‌, రాజాం

మనిషి ప్రతి అవసరానికి ప్రకృతిపై ఆధారపడి జీవించాల్సి ఉంది. ప్రకృతి లేనిదే మనిషి లేడు. వ్యవసాయ పద్ధతులైనా, ఆహారపు అలవాట్లయినా, మానవ ధర్మాలైనా, జీవన విధానమైన సృష్టి చక్రానికి లోబడి ఉండాలి.

– భారతీయ మహర్షులు

రాజాం సిటీ: భూమిపై జీవాల మధ్య భేదమే జీవవైవిధ్యం. ప్రపంచంలో మిలియన్‌ జాతుల జీవాలు ఉన్నాయి. నేడు భూమి వేడెక్కిపోతోంది. కాలుష్యం అధికమవుతోంది. అడవులు, వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ మిత్ర జాతులు అంతరించిపోయి ప్రమాదకర కీటకజాతులు పుట్టుకొస్తున్నాయి. టెక్నాలజీని రుచిమరిగిన మానవ మనుగడ ఈ టెక్నాలజీ కారణంగా నష్టపోతున్న ఇతర జాతుల గురించి పట్టించుకోవడం లేదు.

అంతరిస్తున్న జీవజాతులు

ప్రపంచంలో పలు జీవజాతులు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడాలనే ఉద్దేశంతో పర్యావరణ ప్రేమికులు విస్తృత ప్రచారాలు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి జీవజాతుల పరిరక్షణ నిమిత్తం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహిస్తోంది. 1992 మే 22 నుంచి ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో రక్షణగా..

మన దేశంలో ఆదివాసీలు ఉన్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం రక్షణగా ఉన్నట్లు ఒక అధ్యయనం తెలుపుతోంది. ప్రధానంగా మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో 80 శాతానికి పైగా గిరిజనులు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో జీవవైవిధ్యం, ప్రకృతి సంపద పుష్కలంగా ఉంది. మన రాష్ట్రంలో గిరిజన తెగలు జీవిస్తున్న ప్రాంతాల్లో జీవవైవిధ్యం ఉన్నప్పటికీ పాలకుల్లో సమన్వయం లేకపోవడంతో అక్కడ కూడా యాంత్రీకరణ పెరిగి జీవవైవిధ్యం కనుమరుగవుతోంది.

జన్యుమార్పిడితో ఇబ్బందులు..

జన్యుమార్పిడి విధానం ఇటీవల అధికమైంది. ఫలితంగా ఎక్కడికక్కడే సంకరజాతి ఉత్పత్తులు ఎక్కువవుతున్నాయి. వాటి కారణంగా కొత్త విత్తనాలు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. జన్యుమార్పిడి వల్ల ఇతర జాతులకు నష్టం వాటిల్లితే భవిష్యత్‌లో మానవ మనుగడకు తీవ్రనష్టం కలిగే ప్రమాదం ఉంది.

పెరిగిపోతున్న కాలుష్యం..

ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యం పెరగిపోతోంది. పర్యావరణ పరిరక్ష ణకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం సైతం తూతూ మంత్రంగానే వ్యవహరిస్తోంది. వాల్టా చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎక్కడికక్కడే ఇసుక తవ్వకాలు, చెట్ల నరికివేత, కాలుష్యాన్ని వెదజల్లే మందుసామగ్రి వినియోగించి కొండలు బద్దలుచేయడం, చెరువుల ఆక్రమణ, జనావాసాల మధ్య సెల్‌ఫోన్‌ టవర్లు నిర్మించడం సాధారణమైపోయింది. వీటికి తోడు కాలం చెల్లిన కాలుష్య వాహనాల వినియోగం, రణగొణ ధ్వనులు, అనుమతులుకు మించి నిర్మాణాలు చేయడం, ప్లాస్టిక్‌ వినియోగించడం వంటివి జీవావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. ఫలితంగా పలు జాతుల పక్షులు అంతరించిపోతున్నాయి.

రసాయన వ్యవసాయం..

ప్రస్తుతం వ్యవసాయం కూడా రసాయన ఎరువుల మయంగా మారిపోయింది. గతంలో కృత్రిమ విత్తనోత్పత్తితో పాటు కృత్రిమ వ్యవసాయం ఉండేది. ప్రస్తుతం రసాయన ఎరువుల వినియోగం అధికం కావడం కారణంగా ఉత్పత్తిచేసే ఆహారపు పంటల్లో కూడా నాణ్యత ఉండడం లేదు. వీటికి తోడు రసాయన ఎరువుల కారణంగా పర్యావరణానికి మేలు చేసే కీటకాలు మృతిచెంది, విషజ్వరాలు, రోగాలను వ్యాప్తిచేసే కీటకాలు అధికమవుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు, ప్రజలు మేల్కొనకుంటే మున్ముందు భవిష్యత్‌ అంధకారమే.

అంతరించిపోతున్న జీవజాతులు

ప్రమాదంలో జీవసంపద

మేల్కొనకుంటే ముందుతరాలకు ముప్పు

నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement