దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు ముఖ్యం
● మిమ్స్‌లో ఒకరోజు శిక్షణ
విజయనగరం క్రైమ్: కేసుల దర్యాప్తులోను, నిందితులపై నమోదైన కేసుల్లో పోరెన్సిక్ ఆధారాలు చాలా ముఖ్యమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారరలకు మంగళవారం మిమ్స్‌లో ఫోరెన్సిక్ నిపుణులతో ఒక్కరోజు శిక్షణ జరిగింది. ఈ శిక్షణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు ప్రియాంక, సుమాలిక, ప్రశాంతిలు దర్యాప్తు అదికారులకు ఽఆధారాలు సేకరించడంలో మెలకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ నేర స్థలం నుంచి ఆధారాలు సేకరించడంలో దర్యాప్తు అధికారులు సీరియస్‌గానే దృష్టి పెట్టాలని సూచించారు. శాసీ్త్రయ పద్ధతులలో ఆధారాలు సేకరించడం, లేబిలింగ్ చేయడం కోర్టులో నిరూపిండచం అత్యంత కీలకమని ఎస్పీ అన్నారు. ఆధారాలు సేకరించడంలో సిరాలజీ, ఫోరెన్సిక్ ఫిజిక్స్, డీఎన్‌ఏ, టాక్సికాలజీ, నార్కోటిక్, సైబర్, ఆడియో, వీడియో పరీక్షలకు పంపడంలో మెలకువలను ఫోరెన్సిక్ అధికారులు, దర్యాప్తు సిబ్బందికి తెలియజేశారు. నేరస్థలం నుంచి వేలిముద్రలు సేకరించడం, మత్తు పదార్థాలు, మానవ అవయవాలు, విష పదార్థాలు, రక్త నమూనాలు, సెమన్, వెంట్రుకలు, ఉమ్ము, పాదముద్రలు, మెమరీ కార్డ్స్, సిమ్‌కార్డ్స్ వంటివి ఎలా సేకరించాలో? ఏవిధంగా భద్రపరచాలో ఫోరెన్సిక్ నిపుణులు ఈ ఒకరోజు శిక్షణలో దర్యాప్తు అధికారులకు తెలియజేశారు. అనంతరం నిపుణులను ఎస్పీ వకుల్ జిందల్ జ్ఙాపికలతో సత్కరించారు.


