
ఆర్థిక అవసరాలకు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ
● ఎస్పీ అధ్యక్షతన వార్షిక సమావేశం
● రుణాలపై వడ్డీ శాతం 6 నుంచి 4.08కి తగ్గింపు
● మ్యారేజ్ రుణాలు లక్ష నుంచి రెండు లక్షలకు పెంపు
● పర్సనల్ లోన్ పరిమితి 75 వేల
నుంచీ లక్షకు పెంపు
విజయనగరం క్రైమ్: హోం గార్డ్స్ ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకోవాల్సిన నిర్ణయాలను స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్స్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వార్షిక సమావేశంలో ఎస్పీ వకుల్ జిందల్ అధ్యక్షతన మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా హోం గార్డ్స్ వ్యక్తిగత రుణాలను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే హోం గార్డ్స్ పిల్లల వివాహాలకు రుణాల మంజూరుకు క్రెడిట్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తీసుకున్న రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గించాలని సొసైటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ పోలీస్‌శాఖలో హోం గార్డ్స్ అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని, వారి ఆర్థిక అవసరాల కోసం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పనిచేస్తుందని చెప్పారు. కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో హోం గార్డ్స్ వ్యక్తిగత రుణాలను ప్రస్తుతం ఉన్న రూ.75 వేల నుంచి రూ.లక్షకు పెంచామని తెలిపారు. ఇక హోం గార్డ్స్ వారి పిల్లల వివాహాలకు ప్రస్తుతం తీసుకుంటున్న రుణాలను రూ.రెండు లక్షలకు పెంచామన్నారు. తీసుకుంటున్న రుణాలపై వడ్డీశాతం కూడా తగ్గించామని తెలిపారు. సొసైటీని మరింతగా వృద్ధిలోకి తీసుకువచ్చి ప్రగతి పథం వైపు నడిపించేందుకు సభ్యల నుంచి సలహాలను తీసుకుంటామని ఎస్పీ వకుల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక 2024–2025 వార్షిక సంవత్సరానికి సొసైటీ ఆదాయ, వ్యయాలను తీసుకుంటున్న నిర్షయాలను సొసైటీ సెక్రటరీ సుశీల సభ్యులకు వివరించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత,సీఐలు లీలారావు, చౌదరి, ఆర్‌ఎస్సై గోపాల నాయుడు సంస్థ సెక్రటరీ సుశీల, నీలకంఠం, డైరెక్టర్లు శంకరరావు, గోపాలరావు, రమణ, మహేశ్వరరావు బంగార్రాజులు పాల్గొన్నారు.