
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బొబ్బిలి: పట్టణంలోని ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై వి. జ్ఞానప్రసాద్ తెలియజేసిన వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన బ్రహ్మకుమారీలు మౌంట్‌అబూ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరిని పికప్ చేసుకునేందుకు బొలేరో వాహనంలో శాంబాన లక్ష్మణరావు (62) బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అనంతరం బ్రహ్మకుమారీలను ఎక్కించుకుని సాలూరు వెళ్తుండగా.. ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి స్టీరింగ్‌పై పట్టుకోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొన్నారు. దీంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో అందరూ గాయపడ్డారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ కె. రమణబాబు క్షతగాత్రులను తన ఆటోలో ఎక్కించుకుని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. లక్ష్మణరావు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అనంతరం క్షతగాత్రులు రాజరత్నం, సుజాత, తదితరులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి అక్కడ నుంచి విశాఖ తరలించారు. ఎస్సై జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి