
ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ. 50వేలు
మండలంలోని 42 పంచాయతీలలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌లపై స్థానిక నేతలు ఫిర్యాదు చేయడమే తరువాయి ఫిర్యాదు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్‌తో మాట్లాడి రూ. 50 వేలు ఇవ్వాలని, లేకపోతే నిన్ను తొలగిస్తామని ఉపాధి ఏపీఓ కామేశ్వరరావు హెచ్చరిస్తారు. వేతనదారుల నుంచి రూ. వంద నగదు వసూలు చేస్తున్నప్పటికీ, ఫిర్యాదు వచ్చిన ప్రతిసారీ రూ. 50 వేలు ఇవ్వాలని ఒత్తిడి రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు లబోదిబోమంటున్నారు. మండలంలోని మణ్యపురిపేట, రాగోలు ఫీల్డ్ అసిస్టెంట్‌లపై ఫిర్యాదు రావడంతో రూ. 50 వేలు ఇవ్వాలని ఉపాధి ఏపీఓ డిమాండ్ చేశారు.
వాస్తవం కాదు
ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమితులైన వారి నుంచి రూ. 50 వేల నగదు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. వేతనదారుల వద్ద నుంచి రూ. వంద వసూలు చేయడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా నగదు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులలో వాస్తవం లేదు .
కామేశ్వరరావు, ఏపీఓ, ఉపాధి హమీ పథకం , గుర్ల
ఒత్తిడి తెచ్చి రాజీనామా
చేయించారు
రాగోలు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేయించారు. నాపై ఫిర్యాదులు వస్తున్నాయని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగదు ఇవ్వకపోవడంతో ఉపాధి హమీ పనులలో చాలా అవకతవకలు జరిగాయని బెదిరించారు. అవకతకవలలో నిజం అయితే మీ ఆస్తి అమ్మైనా ప్రభుత్వానికి చెల్లించాలని , లేనిచో మీ స్థిరాస్తులు వేలం వేయిస్తామని బెదిరించారు. రాజీనామా చేస్తే ఎటువంటి విచారణ ఉండదని చెప్పడంతో ఒత్తడికి తలొగ్గి రాజీనామా చేశాను.
పతివాడ శ్రీను, రాగోలు
రూ.50 వేలు ఇచ్చాను
మణ్యపురిపేట సీనియర్ మేట్‌గా పనిచేస్తున్న నాకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందిస్తానని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 50 వేలు ఇచ్చిన తర్వాత మరో రూ. 10 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. రూ. 10 వేలు ఇవ్వకపోవడంతో మరో మహిళలకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించారు. సీనియర్ మేట్‌గా ఉన్నప్పుడు గ్రామంలో పనిచేసిన 200 మంది నుంచి వారానికి రూ. 100 నగదు వసూలు చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓకి అందించాను.
గార రామలక్ష్మి, మణ్యపురిపేట
30,775 వేతనదారులు
మండలంలోని 42 పంచాయతీలలో 19,548 జాబ్ కార్డులున్నాయి. వీరిలో 34,711 మంది వేతనదారులు ఉపాధి హమీ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా.. 30,775 మంది పనులకు హాజరవుతున్నారు. పనులు చేస్తున్న వారిందరి నుంచి వారానికి రూ. వంద వసూలు చేయడంతో వారానికి రూ. ముప్‌పై లక్షల పైనే నగదు వసూలవుతుంది. ఇంతా నగదు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని వేతనదారులు చర్చించుకుంటున్నారు. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు చెరువుల వద్ద నిర్మించిన శిలాఫలకాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన నగదు సర్పంచ్‌ల ఖాతాలకు జమ చేయకుండా ఉపాధి హమీ అధికారుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.

ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ. 50వేలు