
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160
కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు
సాలూరు: పట్టణంలోని 18వ వార్డు పరిధి దుర్గానవీధిలో నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. శనివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమేశారు. చిన్నారులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.
ఖేలో ఇండియా పోటీలకు ముగ్గురు..
విజయనగరం: ఢిల్లీలో ఈ నెల 20 నుంచి 23 వరకు జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు పారా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులను శనివారం స్థానిక క్రీడాభివృద్ధి కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన పారా ఒలింపిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిల్లక లలిత, దొగ్గా దేముడు నాయుడు, సుంకరి దినేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఖేలో ఇండియా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో కిల్లక లలిత ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఆడేందుకు వెళ్లగా.. మిగిలిన ఇద్దరు త్వరలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని తెలిపారు. ఖేలో ఇండియా పోటీలలోనూ బాగా రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
27న స్వయం ఉపాధి
శిక్షణకు ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరేడ్‌లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. పురుషులకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషన్ (75 రోజులు), సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), హౌస్ వైరింగ్ (30 రోజులు).. అలాగే మహిళలకు టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ డీటీపీ కోర్సు (45 రోజులు), మగ్గం అండ్ శారీ పెయింటింగ్ వర్క్స్ (30 రోజుల పాటు)లలో శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయాలుంటాయన్నారు. మరిన్ని వివరాలకు 90147 16255, 94917 41129, 98669 13371, 998 99 53145 నంబర్లను సంప్రదించాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు
పాల పౌడర్
● సీ్త్ర సంక్షేమశాఖ ఆర్‌జేడీ చిన్మయిదేవి
రామభద్రపురం: అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్ల స్థానంలో పాల పౌడర్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్టు సీ్త్ర సంక్షేమ శాఖ ఆర్‌జేడీ చిన్మయిదేవి తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే ఏజెన్సీకి చెందిన రామభద్రపురంలో ఉన్న గోదాంను ఆమె శనివారం సందర్శించారు. సరుకుల సరఫరా, నిల్వలను ఏజెన్సీ నిర్వాహకుడు బండారు నాగరాజును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మన్యం, భద్రగిరి, కురుపాంలలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పాలపౌడర్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంలో భాగంగా 3,173 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా చేస్తామని తెలిపారు.

చికెన్

చికెన్