
పరిశోధన ప్రతిభతో ఉన్నత స్థాయిలో స్థిరం
● జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి
విజయనగరం అర్బన్: కళాశాల విద్యలోనే విద్యార్థులు పరిశోధన దృక్ఫథంపై ప్రతిభను మెరుగుపరుచుకుంటే ఉన్నత స్థాయి ఉద్యోగ, ఉపాధిలో స్థిరపడవచ్చని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్‌టీయూ జీవీలోని ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘క్రిసెన్స్ 2కే25’ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సాకేతిక సదస్సును ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరిస్తున్న సాంకేతిక పరిశోధనా అంశాలపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల్లో విద్యార్థి పాల్గొంటే నూతన సాంకేతిక నిపుణతను మెరుగుపరచుకోవచ్చన్నారు. అనంతరం సదస్సు గ్రూప్ కెప్టెన్ పోలా ఆనంద్ నాయుడు సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ మరియు ప్రాక్టీకల్ మెషీన్ లెర్నింగ్ అంశంపై సదస్సులో వివరించారు. సదస్సుకు సమన్వయ కర్తలుగా డాక్టర్ ఆర్‌డీడీ శివరాం, వి.నారాయణరావు, విద్యార్థి సమన్వయకర్తలుగా తనూజ్ హేమంత్, పెడాడ బలాశ్రీ వ్యవహరించారు.