
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల కృషితో ప్రజలకు రాయితీలు అందుతున్నాయి. సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు అభివృద్ధి చెందాయి.
– రవివర్మ, బీజెపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
న్యాయం జరిగింది
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి హయాంలో న్యాయం జరిగింది. రాష్ట్ర పునర్వ విభజన చట్టాన్ని అమలు చేయడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ, టీడీపీ రెండు నాల్కుల ధోరణిని అవలంబించాయి. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యం దక్కింది. అధికార వికేంద్ర కరణతో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
– బి.భానుమూర్తి, విజయనగరం
డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ విద్యా బోధనను ప్రభుత్వం చేరువచేసింది. విద్యార్థులకు అందించిన ట్యాబ్‌లు చదువుకు ఉపయోగపడుతున్నాయి. జగనన్న గోరుముద్ద కింద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోంది. గతంలో ఇంతటి పర్యవేక్షణ ఉండేదికాదు. నేడు జవాబుదారీ తనం పెరిగింది. వలంటీర్ వ్యవస్థతో ఇంటివద్దనే అర్హులకు పథకాలు అందుతున్నాయి. పాలనలో వేగం పెరిగింది. కోవిడ్ సమయంలో ప్రభుత్వ కృషి భేష్.
– సారిక సతీష్, లెక్చరర్, విజయనగరం
