కనీవినీ ఎరుగని అభివృద్ధి: ఎమ్మెల్యే కంబాల జోగులు | - | Sakshi
Sakshi News home page

కనీవినీ ఎరుగని అభివృద్ధి: ఎమ్మెల్యే కంబాల జోగులు

Nov 17 2023 12:54 AM | Updated on Nov 17 2023 12:54 AM

- - Sakshi

రాజాం నియోజకవర్గంలో ఎన్నడూ చూడని విధంగా సామాజిక, సంక్షేమ అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. నియోజకవర్గంలో నవరత్నాల పేరుతో డీబీటీ కింద అర్హులకు రూ.1176 కోట్లు, నాన్‌ డీబీటీ కింద రూ.204 కోట్ల ఆర్థిక ప్రయోజనం వెనుకబడిన వర్గాలకు కలిగిందన్నారు. 85 సచివాలయ భవనాల నిర్మాణాలకు రూ.33.70 కోట్లు, 86 ఆర్‌బీకే భవనాలకు రూ.17.66 కోట్లు, విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణానికి మరో రూ.17.66 కోట్లు, బల్క్‌ మిల్క్‌ కేంద్రాలకు రూ. 3.47 కోట్లు, లైబ్రరీలకు రూ.3.84 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నాగావళి నదిపై రుషింగి, కిమ్మి గ్రామాల మధ్య వంతెన నిర్మించిందని, తోటపల్లి రెగ్యులేటర్‌ కుడికాలువ ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తోంద న్నారు. రాజాం రహదారి విస్తరణ పనులు గతంలో రూ.10 కోట్ల వ్యయంతో పూర్తిచేయగా, తాజాగా మరో రూ. 20 కోట్ల ఖర్చుతో పనులు జరుగుతున్నాయని వివరించారు. నియోజకవర్గంలో పదివేల పక్కా ఇళ్లు, 3,200 ఇళ్ల స్థలాలు ఇచ్చామని వివరించారు. నియోజకవర్గం మొత్తంపై జల్‌జీవన్‌మిషన్‌ కింద రూ.133.97 కోట్ల ఖర్చుతో ఇంటింటికీ కుళాయిలు వేస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement