విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ పోస్టుల భర్తీని ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తోంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తోంది, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి ఒకసారి నియమకాలు చేపట్టేవారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పడిన ఖాళీల లను మూడు నెలలకు ఒకసారి భర్తీ చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సకాలంలో పోస్టులు భర్తీ అవుతున్నాయి.
జనవరిలో 120 పోస్టుల భర్తీ
ఈఏడాది జనవరి నెలలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా, మిని అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు 120కి నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ కూడా పూర్తి చేశారు. తాజాగా మరో 78 పోస్టులకు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో 10 అంగన్‌వాడీ, 53ఆయా, 15 మినీ అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాకు రూ.7 వేలు చొప్పన గౌరవ వేతనం చెల్లిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా, మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు 10 వతరగతి పాసై సంబంధిత గ్రామ వివాహిత అయి ఉండాలి. 1–7–2022 నాటికి 21నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
గడువులోగా దరఖాస్తు
అంగన్‌వాడీ పోస్టుల భర్తీ పారదర్శికంగా జరుగుతోంది. 78 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. గడువులోగా భర్తీ చేస్తాం. గడవులోగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి. – బి.శాంతకుమారి,
జిల్లా సీ్త్ర, శిశు సాధికారత అధికారిణి
78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తోటపాలెంలో పిల్లలకు బోధిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్త


