ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జైలు అధికారులు ఘనంగా నిర్వహించారు. జైలు లోపల సుమారు 1,200 మంది ఖైదీలతో 80 మంది జైలు సిబ్బంది యోగాసనాలు వేయించి, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించారు. ఇక్కడ ఖైదీలు, సిబ్బంది వివిధ ఆకారాల్లో ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా జైలు పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు మాట్లాడుతూ కారాగారాల్లో యోగ సాధన వల్ల ఖైదీల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సూర్యకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


