లారీ ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

అక్కిరెడ్డిపాలెం: ఆటోనగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్దుల్‌ గఫార్‌ (17) అనే ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటోనగర్‌ ఎస్‌ఆర్‌ఎంటీ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సత్తార్‌ కుమారుడు గఫార్‌ స్థానిక కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. సమీపంలోని పెట్రోల్‌ బంక్‌లో బైక్‌కు పెట్రోల్‌ పోయించుకుని తిరిగి వస్తుండగా.. ఆటోనగర్‌ ఎంఎస్‌ఎంఈ కార్యాలయం వద్దకు రాగానే ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై గఫార్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement