యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

తాటిచెట్లపాలెం: ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాధుర్‌ సూచించారు. సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రైల్వే ఇండోర్‌ స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జీఎం మాట్లాడుతూ దేశ సేవలో నిరంతరం విధులు నిర్వర్తించే రైల్వే కుటుంబానికి యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే వుమెన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రెసిడెంట్‌ చారు మాధుర్‌, ఆయా విభాగాల ప్రిన్సిపల్‌ హెడ్స్‌, యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement