తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ డివిజన్ డీఆర్‌ఎం లలిత్‌బోహ్రా ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుభం కాంప్లెక్స్‌లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రధాన రైల్వేస్టేషన్లలో యోగా వేడుకలు చేపట్టారు. డీఆర్‌ఎం ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు ఇ.శాంతారాం(ఇన్‌ఫ్రా), కె.రామారావు(ఆపరేషన్స్), సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ జూసుఫ్ కబీర్ అన్సారీ, ఆయా బ్రాంచ్‌ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


