మహారాణిపేట: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ ‘బీన్యూ మొబైల్స్’ ఆధ్వర్యంలో సరికొత్త ‘షియోమీ 17టీ’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ విశాఖ బీచ్‌లో వైభవంగా జరిగింది. బీన్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి, సీఈవో సాయి నిఖిలేష్, ఈడీ సాయి నితేష్ తమ సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందంతో కలిసి ఈ మెగా ఈవెంట్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. లాంచ్ మంత్ ఆఫర్ కింద కొనుగోలు చేసిన ఏడాదిలోపు 60 శాతం గ్యారెంటీ బైబ్యాక్ వాల్యూ కింద రూ.35,999 పొందే సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా బీన్యూ మొబైల్స్ సీఎండీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమకు 150కి పైగా స్టోర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో పాటు కాంప్లిమెంటరీగా యూట్యూబ్ ప్రీమియం, స్పాటిఫై ప్రీమియం స్టాండర్డ్, గూగుల్ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయని వెల్లడించారు. కస్టమర్లందరూ ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అట్టహాసంగా నిర్వహించిన బీన్యూ మొబైల్స్


