మారుతున్న కాలం, మారాల్సిన నాన్న | - | Sakshi
Sakshi News home page

మారుతున్న కాలం, మారాల్సిన నాన్న

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

నస్తత్వ శాస్త్రవేత్తలు ఇప్పుడు చెప్పేది ఒక్కటే.. తండ్రి పాత్ర కేవలం పోషణకే పరిమితం కాదు. సంపాదనతో పాటు, భావోద్వేగపరంగా పిల్లలకు అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యం. క్రమశిక్షణాధికారి అనే పాత నమూనా నుంచి బయటపడి, పిల్లల ఆలోచనలను, అభిప్రాయాలను ఓపికగా వినే నాన్నగా మారాలన్నది నేటి అవసరం. ప్రతి సమస్యలో పిల్లలతో పాటు నడవాలన్నదే వారి కోరిక. ఎందుకంటే ఇంటి పెద్దగా నాన్న ఎంత బలంగా నిలబడ్డా, పిల్లలకు కావాల్సింది ఆయన భుజం మీద చెయ్యి మాత్రమే కాదు..తన మనసులో మాట చెప్పుకునే ఒక స్నేహితుడు కూడా. ఈ ఫాదర్స్‌ డే సందర్భంగా.. నాన్నతో ఒక్క మాట మాట్లాడండి. ఆయన మౌనంలో దాగున్న ప్రేమను గుర్తించండి. ఎందుకంటే నాన్న అంటే బాధ్యత మాత్రమే కాదు..మాటల్లేకుండా రాసిన ఒక ప్రేమ కవిత్వం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement