నాన్నే నా హీరో | - | Sakshi
Sakshi News home page

నాన్నే నా హీరో

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

నా తప్పులు, నిర్లక్ష్యంపై నాన్న వేసిన మందలింపులే ఈరోజు నాకు జీవితపాఠాలుగా మారుతాయని ఊహించలేదు. ఏమీ లేని స్థాయి నుంచి నన్ను ఈ స్థితికి తీసుకురావడంలో నాన్న చేసిన త్యాగాలు, శ్రమ, నాపై ఆయన ఉంచిన నమ్మకమే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ప్రతి విజయవంతమైన కుమారుడి వెనుక తన కలలను త్యాగం చేస్తూ నిరంతరం కష్టపడే తండ్రి ఉంటాడు. ఈ రోజు నేను ఉన్న ఈ ఉన్నత స్థానానికి నాన్న ప్రేమ, మార్గదర్శనం, ఆశీర్వాదాలే కారణం. నా జీవితంలో నాన్నే నా మొదటి హీరో. – ఈమని అభయ్‌ కృష్ణ, పాలసీ ఇంప్లిమెంటేషన్‌ రీజనల్‌ హెడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement