‘ఏరా’ ఎలక్ట్రిక్‌ బైక్‌ విక్రయాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘ఏరా’ ఎలక్ట్రిక్‌ బైక్‌ విక్రయాల ప్రారంభం

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

మహారాణిపేట: భారతీయ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ‘మ్యాటర్‌’ రూపొందించిన అత్యాధునిక ‘ఏరా’ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ విక్రయాలు విశాఖలో ప్రారంభమయ్యాయి. దేశంలోనే గేర్లు (4–స్పీడ్‌ గేర్‌బాక్స్‌) కలిగిన తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌గా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. 5 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేసే ఈ బైక్‌ కేవలం 25 పైసల వ్యయంతో ఒక కిలోమీటరు ప్రయాణిస్తుందని, కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 3 రైడింగ్‌ మోడ్స్‌, 7 అంగుళాల స్మార్ట్‌ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, నావిగేషన్‌, స్మార్ట్‌కీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్న ఈ బైక్‌కు జీవితకాల బ్యాటరీ వారంటీ ఇస్తున్నట్లు విశాఖ డీలర్లు నరేష్‌ జైన్‌, మహావీర్‌ జైన్‌ వెల్లడించారు. ఆసక్తి గల వినియోగదారులు ఏరా ఎక్స్‌పీరియన్స్‌ హబ్‌ను సందర్శించి టెస్ట్‌ రైడ్‌ చేయవచ్చని వారు కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement