పిడుగుల మోత.. కుండపోత | - | Sakshi
Sakshi News home page

పిడుగుల మోత.. కుండపోత

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

నగరంలో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షం వివరాలు

ప్రాంతం వర్షం

(మిమీ.లలో)

ఆరిలోవ 56.0

సీతమ్మధార 53.1

మహరాణిపేట 47.1

వన్‌టౌన్‌ 38.8

గురుద్వార 37.3

హనుమంతువాక 37.0

ఆనందపురం 24.5

మధురవాడ 23.0

జూపార్క్‌ 20.0

సాక్షి, విశాఖపట్నం: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ నగరం రాత్రికి వరుణుడి ప్రతాపంతో వణికింది. ఉరుములు, మెరుపులు, పిడుగుల మోతల మధ్య ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుతుపవనాలు క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయింది. ఆకస్మికంగా కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదించగా, కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో నగరం చల్లబడింది.

వాహనదారులు పాట్లు

బీచ్‌ రోడ్డులో చెల్లాచెదురైన యోగా మ్యాట్‌లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement