హాజరుకానున్న 8,015 అభ్యర్థులు
మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ)–2026 పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 8,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఉంటుందని, దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించినట్లు తెలిపారు. అభ్యర్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, అనంతరం కేంద్రాల గేట్లు మూసివేస్తారని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే తమ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీసీపీ మణికంఠ, సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
నీట్ పరీక్షకు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ల పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


